*నిరంతర విధుల నిర్వహణ తో ఉక్కిరి బిక్కిరి**తమ మరచి కుటుంబాలకు దూరంగా*.
*ఏడు నెలల గర్భిణీ తన విధి నిర్వహణలో శారీరక మానసిక ఒత్తిడి తట్టుకోలేక కడుపులో పసికందు మృతి
*తమ సమస్యల ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేసేందుకు సమాయత్తమవుతున్న బాధిత హెల్త్ సెక్రటరీలు
విజయవాడ సిటీ (తెలుగు తేజం ప్రత్యేక ప్రతినిధి)కరోనా ప్రజల జీవితాలను ఎంతగా పెనవేసుకుందో..ఇదే సందర్భంలో రాష్ట్రంలో హెల్త్ సెక్రటరీ(ఏఎన్ఎం)లు జీవితాలను నిశితంగా పరిశీలిస్తే, వారు విధి నిర్వహణ చేపట్టిన నాటి నుంచి, నేటి వరకు కరోనా ప్రభావం కావచ్చు ఇతర సమస్యలు ఏమైనా కావచ్చు వారి కుటుంబ సభ్యులను సైతం విస్మరించే విధంగా తాము పుట్టింది ప్రజా శ్రేయస్సు కోసమే అనే రీతిలో నిరంతరం ప్రజా ఆరోగ్య భద్రతకు పెద్ద పీట వేస్తూ తీవ్రమైన మానసిక ఒత్తిళ్ళ ను సైతం ఎదుర్కొంటూ నిరంతరం ప్రజలమధ్య ఉంటూ, చివరకు తమ ఆరోగ్య పరిస్థితులను సైతం పట్టించుకోకుండా, ఒక్కొక్కసారి సరైన ఆహారం తీసుకోలేక, ఒంట్లో నిస్సత్తువగా ఉన్నప్పటికీ పైకి మాత్రం చెరగని చిరునవ్వు నవ్వుతూ, తమ దగ్గరకు వచ్చే వారికి తమ సేవలను అందిస్తూనే ఉన్నారు.ఇది ఇలా ఉండగా ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా, రెండో శనివారం, ఆదివారం, పండగలు, పబ్బాలు ఇలాంటి రోజులు సైతం మరచి పూర్తిగా విధి నిర్వహణ లోనే ఉంటూ. ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించడమే లక్ష్యంగా తమ సమస్యలను సైతం మరచి ప్రజల జీవితాల్లో మంచి ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నప్పటికీ, ఏఎన్ఎం ల జీవితాలు మాత్రం చాలా అత్యంత దయనీయమైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.ఈ ఏ ఎన్ ఎమ్ పరిస్థితి అత్యంత దయనీయం ప్రజలకు సేవ చేస్తునే తన కడుపులో పెరుగుతున్న నెలల పసికందుకు సరైన ఆహారం అందించలేని.అధికారుల ఒత్తిడి వల్లే 7 నెలల పసికందు మృత్యువు*విధి నిర్వహణలో భాగంగా, తన కడుపులో పెరుగుతున్న పసికందుకు, సరైన పోషణ ఇవ్వలేని అత్యంత దయనీయ స్థితిని, ఒక ఏఎన్ఎమ్ ఎదుర్కొని చివరకు ఏడు నెలల పసికందు మృత్యువు బారిన పడటానికి, సంబంధిత అధికారుల తీవ్ర ఒత్తిళ్లు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవానిపురం ప్రాంతంలోని ఒక వార్డు లో హెల్త్ సెక్రటరీ గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ తన కడుపులో శిశువు పెరుగుతున్నారని తనకు విశ్రాంతి కావాలని అధికారులకు చెప్పినప్పటికీ ఏమాత్రం కనికరం చకుండా, మానవత్వం అనేదే లేకుండా, విధి నిర్వహణ చేయాల్సిందే అని వేధించి విధులకు హాజరు కావాల్సిందేనని చెప్తూ, తీవ్రమైన వేధింపులు చేపట్టారు. ఒక పక్క ఆర్థిక స్థితి గతి మరోపక్క విధి నిర్వహణ ప్రజా జీవితానికి పెద్దపీట, కుటుంబ పరిస్థితి ఇలా అనేక రకంగా సేవా మార్గంలో ఉన్నప్పటికీ, అధికారుల వేధింపులతో, విశ్రాంతి తీసుకోలేని స్థితిలో బాధిత ఏఎన్ఎం తన కడుపులో పెరుగుతున్న శిశువు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడానికి సంబంధించిన అధికారులే కారణమని ఈ ప్రాంత వాసులు వాపోతున్నారు. ఇలాంటి అధికారులు, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తు ప్రభుత్వంపై నిందలు వేసేందుకు కారణమవుతున్నారు. కొంతమంది అధికారులు కావాలనే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ఇలాంటి నీచమైన పనులు సైతం చేస్తున్నారంటే ప్రభుత్వ పెద్దలు ఇలాంటి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకొని ఏఎన్ఎం ల ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.