మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి
విజయవాడ (తెలుగు తేజం ప్రతినిధి):
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి అన్నారు. స్థానిక 44వ డివిజన్ లోని లేబర్ కాలనీ లో ఉన్న ఉప్పలపాటి రామచంద్ర రావు హై స్కూల్లో మధ్యాహ్న భోజనం అమలు తీరుతెన్నులను గురువారం 44వ డివిజన్ కార్పొరేటర్ మైల వరపు రత్నకుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించడం తో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రత్నకుమారి మాట్లాడుతూ విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని అందజేయాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అంద చేసేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. నాణ్యమైన సరుకులు ,కూరగాయలతో విద్యార్థులకు మంచి భోజనాన్ని మధ్యాహ్న భోజన పథకంలో అందజేస్తున్నట్లు రత్నకుమారి చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాసిరకం భోజనాన్ని విద్యార్థులకు పెట్టేవారని ఆమె విమర్శించారు. జగనన్న ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్నో ఉత్తమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి ఉన్నతిని సాధించాలని ఆమె ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర వై.యస్.ఆర్.సి.పి సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు హై స్కూల్ పేరెంట్స్ కమిటీ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.