నియోజకవర్గంలోని 70 మంది నామిని లబ్ధిదారుల కుటుంబాలకు కోటి 67 లక్షలు మంజూరు
వైయస్ఆర్ భీమా మంజుారులో ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యే డా”మొండితోక జగన్ మోహన్ రావు
తెలుగు తేజం, నందిగామ : నందిగామ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 70 మందికి వైయస్సార్ బీమా నుండి మంజూరైన కోటి 67 లక్షల రూపాయల చెక్కులను శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు నామిని ల కుటుంబాలకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆలంబనగా జగనన్న ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ వైయస్సార్ బీమా అని తెలిపారు , ప్రతి పేద కుటుంబానికి అన్నివేళలా జగనన్న ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ,గతంలో ఉన్నట్లుగా ప్రతి పాలసీ కి PMJJBY, PMSBY కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 50 శాతం వాటా ఇప్పుడు లేనప్పటికీ, మానవతా దృక్పథంతో దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఉచిత బీమాను జగనన్న ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు , కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే సహజ మరణానికి రూ.2 లక్షలు ,ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే రూ.5 లక్షలు ,పాక్షిక శాశ్వత అంగవైకల్యానికి రూ 1.5 లక్షలను అందించడమే కాకుండా, గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రమాదవశాత్తు ఈ అర్హులలో చనిపోయిన వారి కుటుంబాలకు గ్రామ సచివాలయం నుంచి తక్షణ సాయంగా రూ.10 వేలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ఎమ్మార్వో లు, ఎంపీడీవోలు ,భీమా మిత్రలు ,ఏపీఓలు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.