తెలుగు తేజం, నందిగామ టౌన్ : రైతుపేట పార్టీ కార్యాలయం నందు ఐతవరం గ్రామానికి చెందిన తొగటి అనమయ్యా తో కలిసి 20 కుటుంబాల వారు మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు మరియు మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో వైస్సార్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ లోకి చేరారు వారి అందరిని తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా దేవినేని మాట్లాడుతూ రాన్నున్న పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు ప్రతీ ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ కారక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.