రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం ఆయనకు ఇష్టం లేదనుకుంటా…….!
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలను తీవ్రంగాఖండిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ ముస్లిం సంఘాల కన్వీనర్, సూఫీ మత గురువు అల్తాఫ్ రజా
తెలుగు తేజం , విజయవాడ: దర్గాలపై సోము వీర్రాజు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అని,కులమతాలకు అతీతంగా భక్తులు దర్గాలకు వస్తూ ఉంటారు అని ఈ విషయాలను కూడా రాజకీయం చేయడం సోము వీర్రాజు కి తగదని ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆంధ్ర ప్రదేశ్ ముస్లిం సంఘాల కన్వీనర్ మరియు సూఫీ మత గురువు అల్తాఫ్ రాజా పేర్కొన్నారు. గురువారం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ సమీపంలోని దర్గా లో వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…..
గత ప్రభుత్వం 400 ఏళ్ల చరిత్ర కలిగిన హజ్రత్ సయ్యద్ అలీ షా ఖాద్రీ దర్గాను దుర్గ ప్లైఓవర్ పేరుతో కూల్చే ప్రయత్నం చేసింది.
ప్లైఓవర్ నిర్మాణం పూర్తి అయినా దర్గా నిర్మాణం చేయకపోవడం బాధాకరం అని,టీడీపీ హయాంలో దేవాలయాలు,దర్గాలు కూల్చేసే సమయంలో వైసీపీ తరపున అనేక పోరాటాలు చేసిన వ్యక్తి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అని, ఆయన గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దర్గాలు,దేవాలయాలు పునః నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో ముస్లింలు ఓట్లు వేసి గెలిపించారు,దర్గా అభివృద్ధి కి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎంతగానో సహకరిస్తున్నారు.
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముస్లింలకు అన్ని వేళలా అండగా ఉన్నారు.మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్గాలకు వెళ్లకూడదని చెప్పడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు.
దర్గా స్థలం నుంచి దుర్గగుడి కి వెళ్లే భక్తులను ఏనాడైనా ముస్లింలు ఇబ్బందులు పెట్టారా?ఇక్కడ అందరూ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఒక కుటుంబంలా బతుకుతున్నాం అని మా మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు అని తెలిపారు.
ముస్లింలకు చెందిన అనేక స్థలాల్లో హిందు దేవాలయాలు నిర్మించారు.బీజేపీ రాష్ట్రంలో కులమతాల మధ్య విభేదాలు సృష్టిస్తోంది.సీఎం జగన్ అన్ని కులమతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు.4 ఏళ్లుగా దర్గా బురద కుంటలో ఉంది.ఏనాడైనా అభివృద్ధి కి బీజేపీ నేతలు చర్యలు తీసుకున్నారా.
బీజేపీ పరిపాలిత రాష్ట్రాల్లో దర్గాలను కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తుంటే సోము వీర్రాజు కనీస అవగాహన లేకుండా విమర్శలు చేయడం సరికాదు అని మరోమారు ఇలాంటి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ముస్లిం మైనార్టీ నాయకులు సాజిద్ ఖాన్, ఎండి ఇర్ఫాన్ , హయాత్ మరియు ముస్లిం మత గురువులు, దర్గా ముజావర్లు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.