తెలుగు తేజం, విజయవాడ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ కొత్త గవర్నమెంట్ ఆసుపత్రి నందు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తరపున వివేకానంద యువజన సమాఖ్య స్వచ్ఛంద సేవా సంస్థ వారిచే గత సంవత్సరంలో కరోనా ప్రారంభ సమయం నుండి ఇప్పటివరకు కూడా కొన్ని వేల మంది కరోనా బాధితులకు తమ ప్రాణాలు పణంగా పెట్టి విశేషమైన ఆరోగ్య సేవలందించిన ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ శ్రీమతి శోభా, ఆవిడ నేతృత్వంలో పనిచేసిన డాక్టర్ సిద్దేశ్వరి (ప్రొఫెసర్ ), డాక్టర్ వి అరుణ (పల్మనాలజిస్ట్ ), డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ టీ సూర్య మంగాదేవి ఆర్ ఎమ్ ఓ ను శాలువా, మొమెంటో లతో ఘనంగా సత్కరించి బోన్సాయ్ పూల మొక్కల కుండీలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆసుపత్రి సూపర్డెంట్ శివశంకర్ మాట్లాడుతూ కరోనా సమయంలో మా మహిళా డాక్టర్లు రాత్రి పగలు తేడా లేకుండా కరోనా పేషెంట్ లకు తమ శక్తి మేర విశేషమైన వైద్య సేవలు అందించారని వారి సేవలను కొనియాడారు. సమాఖ్య అధ్యక్షులు చనమొలు రామచంద్రరావు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులు 5 నుంచి 20, 25 లక్షల వరకు వసూలు చేశాయని, అదే సమయంలో అదే వైద్యం ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు పైసలు ఖర్చు లేకుండా అత్యంత ఖరీదైన మందులు, ఇంజక్షన్లు ఇచ్చి కడు పేదవాని నుంచి లక్షాధికారి వరకు కూడా వైద్యం అందించి కొన్ని వేల మందిని కరోనా బారి నుంచి కాపాడి వారికి పునర్జన్మ ప్రసాధించడంలో ఈ మహిళ డాక్టర్ల పాత్ర వెలకట్టలేనిది అని వారికి పాదాభివందనం చేశారు. ఈ సభలో ఆసుపత్రి సి ఎస్ ఆర్ ఎమ్ ఓ డాక్టర్ హనుమంతరావు గారు, వివేకానంద యువజన సమాఖ్య అధ్యక్షులు చనమొలు రామచంద్ర రావు, సమాఖ్య డైరెక్టర్లు ఏ సురేష్, కె నాగేశ్వరరావు, సభ్యులు అప్పారావు, కళ్యాణి , ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.