తెలుగు తేజం : జగ్గయ్యపేట : కృష్ణా జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాద్ బాబు ఆదేశాల మేరకు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వకుల్ జిందాల్ పర్యవేక్షణలో, నందిగామ డిఎస్పీ
జి. నాగేశ్వరరెడ్డి, జగ్గయ్యపేట సీఐ పి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని వచ్చిన నూతన మద్యం పాలసీకి వ్యతిరేఖంగా, ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం రవాణా జరుగుతుందనే రహస్య సమాచారంపై చిల్లకల్లు ఏసై వి. వెంకటేశ్వరరావు ఆదివారం రాత్రి గరికపాడు చెక్ పోస్ట్ వద్ద, చెక్ పోస్ట్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించగా, తనిఖీలలో భాగంగా హైదరాబాద్ వైపు నుండి వస్తున్న AP 16 TA 4444 నెంబర్ గల దుర్గా ట్రావెల్స్ కి చెందిన బస్ ఆపి, తనిఖీ చేయగా ఆబస్సు డ్రైవర్ అయిన విజయవాడ, చిట్టినగర్ కు చెందిన కర్రే శ్రీధర్ అనే వ్యక్తి, అదే బస్సుపై క్లీనర్ గా పనిచేసే జానీ అను వ్యక్తితో కలిసి, తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్ నుండి 240 క్వార్టర్ బాటిల్స్ ను బస్సు సైడ్ డిక్కీలో పెట్టుకొని, వాటిని విజయవాడలో ఎక్కువ రేటుకు అమ్ముకొనుటకు తీసుకొని వెళ్తుండగా, వాటిని పట్టుకొని సీజ్ చేసి, బస్సును కూడా సీజ్ చేయడం జరిగింది. సదరు కేసులో డ్రైవర్ శ్రీధర్ ను అరెస్ట్ చేసి కోర్టు నందు హాజరు పరచడం జరిగింది. క్లీనర్ పరారీలో ఉన్నాడు. మద్యం అక్రమ రవాణా విషయంలో ఎంతటి వారినైనా కూడా ఉపేక్షించేది లేదని, వారిని అరెస్ట్ చేయడంతో పాటు, వారి వాహనాలు కూడా సీజ్ చేసి, అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం జరుగుతుందని ఈసందర్భంగా తెలియపరచడమైనది.