తెలుగు తేజం, నందిగామ : విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ విద్యా సంస్థల ఫై కఠిన చర్యలు తీసుకోని గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నందిగామ మండల కార్యదర్శి గోపీనాయక్ అన్నారు. అర్హులైన ప్రతి విద్యార్థికి అమ్మ ఒడి వర్తింప చేయాలని. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించే కళాశాలల పై కఠిన చర్యలు తీసుకోవాలని. ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసిన ఫీజు లో 30 శాతం రాయితీ ఇచ్చి 70 శాతం మేర ఫీజులు వసూలు చేయాలని. మంత్రి చెప్పినా ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేసే దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వం ఇటీవల కార్పొరేట్ విద్యాసంస్థలు పై ఫిర్యాదు ఆధారంగా కార్పొరేట్ కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. జగనన్న అమ్మ ఒడి రెండో విడత చెల్లింపులు రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన విద్యార్థులకు అమ్మబడి రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులందరికీ ఇస్తామని చెబుతూనే కొంత మంది విద్యార్థులకు దూరం చేస్తున్నారని ఆయన అన్నారు. ఢిల్లీలో 60 రోజుల నుంచి జరుగుతున్న రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని. రైతులకు మద్దతుగా 27వ తేదీన ఉదయం10 గంటలకు నందిగామ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో విద్యార్థిని విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులు వివిధ ప్రజా సంఘాల నాయకులు రైతు సంఘం నాయకులు అందరూ పాల్గొంటారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ చందర్లపాడు మండల కార్యదర్శి పాటి.రవి, వేణు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.