తెలుగు తేజం, చందర్లపాడు : రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమంలో భాగంగా చందర్లపాడు మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గుంతలు పడిన రోడ్ల దగ్గర ఉ” 10.15 గం.ల” నుండి 10.45 గం.ల” వరకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కాండ్రపాడు గ్రామం నుండి కోనాయపాలెం, అడవిరావులపాడు గ్రామాల మీదుగా నందిగామ పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారి 12 కిలోమీటర్లమేర పూర్తిగా ధ్వంసమై,గుంతలమయంగా మారిందని ఎన్నడూ లేనంత అధ్వాన స్థితికి చేరిన రహదారులు తక్షణమే బాగు చేయాలని ప్రజల తరఫున భారతీయ జనతాపార్టీ గలమెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సంక్షేమ పథకాల మీదే దృష్టి పెట్టిందని, మౌలిక సదుపాయాలు అయిన రహదారుల అభివృద్ధి మీద దృష్టి ఏమాత్రం లేదని, సంక్షేమం దేవుడెరుగు క్షేమంగా ఉంటే చాలు అని ప్రయాణికులు కోరుకుంటున్నారని తెలిపారు. గుంతలమయంగా ఏర్పడిన రహదారులు వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి లోనై, తరుచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు యుద్ధ ప్రాతిపదికన రహదారి పునరుద్ధరణ పనులు చేపట్టవలసిందిగా కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోసాని గురునాథం, ప్రధాన కార్యదర్శి గొటిక శివకృష్ణారెడ్డి, మండల జడ్పిటిసి అభ్యర్థి బోనం రామిరెడ్డి, రైతు నాయకుడు కొండ్రు సాంబశివరావు, నందిగామ రూరల్ మండల అధ్యక్షురాలు ఝాన్సీరాణి మరియు కాండ్రపాడు గ్రామ యువత పాల్గొన్నారు.