తెలుగుతేజం ఇబ్రహీంపట్నం: స్థానిక అన్నమ్మ దివ్యాంగుల సేవా సంస్థలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకురాలు, రాష్ట్ర మానవ హక్కులు, యాంటీ క్రైమ్ కౌన్సిల్ మహిళా విభాగం చైర్ పర్సన్ డాక్టర్ దాసరి వసంత కుమారి ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షుడు డాక్టర్ వెన్నా కిరణ్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమానికి న్యాయవాది, రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ ఆర్.జె.రాజు హాజరై ప్రసంగించారు. లెనెజింగ్ ప్లాస్టిక్స్ జర్మనీ ప్రతినిధి థామస్ నేతృత్వంలో 65 మంది మహిళలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. అనంతరం వసంత కుమారిని, పలువురు మహిళలను సత్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మహిళా ఎస్సై మణి, న్యాయవాది విజయలక్ష్మి, మహిళా మిత్ర మల్లీశ్వరి, నహిరున్నీసా, సరళ, వెంకాయమ్మ, కరుణ, బాలా, నవీన్ తదితరులు పాల్గొన్నారు.*వసంత కుమారికి సత్కారం*రాష్ట్ర మానవ హక్కులు, యాంటీ క్రైమ్ కౌన్సిల్ మహిళా విభాగం చైర్ పర్సన్ డాక్టర్ దాసరి వసంత కుమారిని టీడీపీ కొండపల్లి పురపాలక అధ్యక్షుడు చుట్టుకుదురు శ్రీనివాసరావు సత్కరించారు. కార్యక్రమంలో కొరటా శ్రీనివాసరావు, వీరాస్వామి, కూచిపూడి దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.