హైదరాబాద్: వరదసాయం కోసం బాధితులు మీ సేవ సెంటర్లకు రావద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సూచించారు. అర్హులను గుర్తించి వరదసాయం అందిస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయని, వరదసాయం అందని వారి వివరాలను అధికారులు సేకరిస్తారని చెప్పారు. బాధితుల అకౌంట్లోనే వరదసాయం డబ్బులు జమ చేస్తామని లోకేష్ కుమార్ స్పష్టం చేశారు.