తెలుగుతేజం, వత్సవాయి : మండలంలోని పలు గ్రామాలలో రేషన్ కార్డులు తొలగించడం జరిగినది. దీనితో పేద ప్రజలు ప్రభుత్వం నుండి అనేక సంక్షేమ పథకాలు అందక పిల్లల చదువుల నిమిత్తం రెవెన్యూ శాఖ నుండి వచ్చేటటువంటి సర్టిఫికెట్లు అందక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. రేషన్ కార్డు ఎందుకు తొలగించారో విషయం తెలుసుకొని దానికి తదుపరి ప్రత్యాన్యా యంగా రెవెన్యూ శాఖ వారు చెప్పిన విధంగా సంబంధిత పత్రాలను అందించినా కూడా అధికారులు కాలయాపన చేస్తున్నారే కానీ వారికి రేషన్ కార్డు అందించలేదని బిజెపి నాయకులను ఆశ్రయించగా వారు మంగళవారం రోజు అర్హులైన వారికి రేషన్ కార్డులు అందించాలని తాసిల్దార్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజమయిన అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయుటకు అనేక కారణాలు చూపి కాలయాపన చేస్తున్నారు. సచివాలయంలో సిబ్బందికి అవగాహనా రాహిత్యం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కావున ఈ సమస్యల పై తాసిల్దార్ కి వినతి పత్రాన్ని అందజేశామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షుడు దామాల ప్రసాద్ ,మండల ప్రధాన కార్యదర్శి లంకెల మల్లారెడ్డి,మండల బీసీ మోర్చా అధ్యక్షుడు సజ్జనపు వెంకటాచారి, మహిళా మోర్చా అధ్యక్షురాలు పిళ్ళెం లక్ష్మీ, పిళ్ళెం పెద్ద కోటయ్య,పిళ్ళెం చిన్న కోటయ్య , చవల అప్పారావు పాల్గొనటం జరిగింది.