దిల్లీ: వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాల తేదీని ఎన్టీఏ ఖరారు చేసింది. ఈ నెల 16న ఫలితాలు వెల్లడించనున్నట్టు కేంద్ర విద్యశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ట్విటర్లో ప్రకటించారు. అయితే, ఫలితాల విడుదలకు సంబంధించిన కచ్చితమైన సమయాన్ని తర్వాత తెలియబరుస్తామని ఆయన పేర్కొన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో (2020-21) ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 13న జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్) నిర్వహించిన విషయం తెలిసిందే. కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే దేశవ్యాప్తంగా 3,862 కేంద్రాల్లో ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించారు. ఈ పరీక్షకు 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు