త్వరలో జరగబోవు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రజలందరికీ పోలీసులు ఎల్లవేళలా తోడుంటారని భరోసా కల్పించుటయే లక్ష్యంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా ips గారి ఆదేశాల మేరకు డిసిపి హరికృష్ణ గారి నేతృత్వంలో నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో రాబోయే ఎన్నికల్లో శాంతిభద్రతలు పై సామాన్య ప్రజలకు అవగాహన కల్పిస్తూ కేంద్ర పారా మిలటరీ సాయుధ దళాలతో కవాతు నిర్వహించారు.. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్రిక , రాజీవ్ నగర్ , ఎల్ బి ఎస్ నగర్ ప్రాంతాల్లో నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ సీఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించారు.. రాబోయే ఎన్నికల్లో శాంతిభద్రతలకు ఎటువంటివిగాతం కలగకుండా సామాన్యుడు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా పోలీసులు చేపడుతున్న వివిధ రకాల ప్రణాళికలో భాగంగానే ఈ కేంద్ర సాయుధ బలగాల కవాతు నిర్వహించామని ఈ సందర్భంగా సిఐ దుర్గా ప్రసాద్ తెలిపారు…