తెలుగు తేజం, జగ్గయ్యపేట : ఎన్నికల కోడు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు తీసుకుంటామని జగ్గయ్యపేట రూరల్ చిల్లకల్లు ఎస్ఐ ఈ వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు రాష్ట్రవ్యాప్తముగా పంచాయతీ ఎన్నికల సందర్భముగా ఎన్నికల కోడు అమలులో ఉందని ఎవరైనా సోషల్ మీడియాలలో పార్టీల గురించి లేదా నాయకుల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసినా, తప్పుడు ప్రచారములు చేసినా, ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు లేదా మద్యము పంపకములు చేసిన పార్టీల మధ్య గొడవలు చెలరేగేలా వ్యాఖ్యలు చేసినా ఎన్నికల కోడు ఉల్లంఘన కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.