రాజమహేంద్రవరం: తెదేపా అధినేత చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయకపోయినా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఆయన్ను అరెస్ట్ చేశారని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు.
రాజమహేంద్రవరంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్‌లో వైకాపా, భాజపా హస్తముందని ఆరోపించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఆయన్ను ఏమీ చేయలేరని హర్షకుమార్ అభిప్రాయపడ్డారు.