హైదరాబాద్ : పాత విధానంలో రిజిస్ర్టేషన్లు చేయాలని, ఎల్ఆర్ఎస్, ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని బుధవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు.