తెలుగు తేజం, నందిగామ : ఎస్ఎఫ్ఐ, సిఐటియు డివైఎఫ్ఐ, యూటిఎఫ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు సందర్భంగా నందిగామ నియోజకవర్గ స్థాయిలో డబుల్స్ షటిల్ టోర్నమెంట్ నందిగామ జిల్లా పరిషత్ హైస్కూల్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసారు. ఈ టోర్నమెంట్ను నందిగామ పోలీస్ స్టేషన్-1 సర్కిల్ ఇన్స్పెక్టర్ హరిప్రసాద్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యువతీ యువకులు చదువులోనూ ఆటల్లోనూ విజయాలు సాధించి ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు. అనంతరం స్వామి వివేకానంద 158 వ జయంతి సందర్భంగా యుటిఎఫ్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ కె. లక్ష్మీనారాయణ , డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్.నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్.నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశ స్వాతంత్రోద్యమ చరిత్ర లో స్వామి వివేకానంద ఆయన రచనలు, సూక్తులు ద్వారా ఆకాలంలో యువతను ఉత్తేజపరిచి స్ఫూర్తిని నింపారు నేటికీ స్వామి వివేకానంద సూక్తులు యువతను దేశ ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో మతోన్మాదాన్ని సృష్టించే విధంగా కులాల మధ్య మతాల మధ్య వైషమ్యాలు తీసుకువస్తూ దేశ భక్తి పేరుతో అంటకాగుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా పరిపాలనను కొనసాగిస్తున్నారు. వీరి కుటిల రాజకీయ ప్రయత్నాలను యువత అర్థం చేసుకొని తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా దేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్రను మరియు పోరాటయోధుల చరిత్రను, రాజ్యాంగాన్ని, లౌకిక వాదాన్ని తూట్లు పొడిచే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. వీరి కుటిల ప్రయత్నాలను యువత గమనించాలని నోటికి లౌకిక వాదాన్ని, మతసామరస్యాన్ని కాపాడే విధంగా యువత ఉండాలని యువజన దినోత్సవం సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం. సోమేశ్వరరావు, సిఐటియు మండల కార్యదర్శి కె.గోపాల్ ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి జి.గోపీనాయక్ పాల్గొన్నారు.