Breaking News

ఏపీవ్యాప్తంగా తెదేపా నేతల గృహ నిర్బంధం

అమ‌రావ‌తి: టిడిపి నేత చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ నేప‌థ్యంలో ఎపి అంత‌టా టిడిపి శ్రేణులు నిర‌స‌న‌ల‌కు దిగారు. ప‌లు జిల్లాలో బంద్ కు పిలుపు ఇచ్చారు. అనేక ప్రాంతాల‌లో పోలీసుల‌కు, కార్యక‌ర్త‌ల‌కు వాగ్వాదం చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు టిడిపి నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్య నేత‌ల‌ను గృహ నిర్భందంలో ఉంచారు. టిడిపి అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని టిడిపి ముఖ్య నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి జిల్లాలోని బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరిలో శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తో పాటు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి,నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి,ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి,భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిలతోపాటు మరింత మంది టిడిపి నాయకులను అదుపులోకి తీసుకొని బండి ఆత్మకూరు స్టేషన్లో ఉంచారు.
కృష్ణా జిల్లా బంద్ కు పిలుపు ఇచ్చిన టిడిపి

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో కృష్ణాజిల్లా వ్యాప్తంగా పోలీసు బలగాలు మోహరించాయి. జిల్లాలోని ప్రధాన ప్రాంతాలలో పోలీస్ బలగాలను దించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పోలీసులు బలగాలు ఏర్పాటు చేశారు. రహదారులపై వాహనాలను తనిఖీ చేస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారు. ఎక్కడికక్కడే బంద్ కు తెదేపా నాయకులు పిలుపునిచ్చారు.

నందిగామలో


చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నందిగామ నియోజకవర్గం అంబారుపేట గ్రామంలో విజయవాడ – హైదరాబాద్ హైవే ఫై నిరసన తెలియ చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు.

చందర్లపాడు గ్రామంలో


చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా చందర్లపాడు గ్రామంలో ధర్నా చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు.

గుడివాడలో


చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ పార్టీ శ్రేణులతో కలిసి శనివారం గుడివాడ లోని
తన స్వగృహంలో టిడిపి నేత వేనిగండ్ల రాము నిరాహార దీక్ష చేపట్టారు. నల్ల రిబ్బన్లు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. చంద్రబాబును విడుదల చేసే వరకు దీక్షను కొనసాగిస్తాం అని రాము అన్నారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. తండ్రిని పరామర్శించేందుకు వెళుతున్న కుమారుడు లోకేష్ ని అడ్డుకోవడం దుర్మార్గం అన్నారు.తన స్వగృహంలో టిడిపి నేత వేనిగండ్ల రాము నిరాహార దీక్ష చేపట్టారు. నల్ల రిబ్బన్లు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. చంద్రబాబును విడుదల చేసే వరకు దీక్షను కొనసాగిస్తాం అని రాము అన్నారు.
చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. తండ్రిని పరామర్శించేందుకు వెళుతున్న కుమారుడు లోకేష్ ని అడ్డుకోవడం దుర్మార్గం అన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *