మెరుగైన వైద్యం కోసం 10 మంది విజయవాడ తరలింపు
విజయవాడ నుంచి ఏలూరుకు ప్రత్యేక వైద్య బృందాలు
ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న డిప్యూటీ సీఎం ఆళ్లనాని
తెలుగు తేజం, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య ఇప్పటివరకు 292కి చేరింది. అస్వస్థతకు గురైన బాధితులు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఇప్పటివరకు 122 మందిని డిశ్చార్జ్ చేశామని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం పదిమందిని అధికారులు విజయవాడ తరలించారు. బాధితులకు వైద్యసిబ్బంది అలుపెరగకుండా సేవలు అందిస్తున్నారు. విజయవాడ నుంచి ఏలూరుకు చేరుకున్న ప్రత్యేక వైద్య బృందాలు చేరుకున్నాయి. లక్షణాలు కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. వైద్య బృందం.. ఇంటింటికి ఆరోగ్య సర్వే చేపట్టింది. టెస్టుల కోసం శాంపిల్స్‌ను అధికారులు వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఫిట్స్ లక్షణాలతో చేరిన బాధితులకు ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో అదనపు బెడ్లు ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంత్రి ఆళ్లనాని పర్యవేక్షణలో కలెక్టర్, అధికారులు చర్యలు చేపట్టారు. కంట్రోల్ రూమ్ ద్వారా కలెక్టర్.. అధికారులకు దిశానిర్దేశం చేశారు.