హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మొత్తం 150 డివిజన్లలో పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రారంభమైన వెంటనే మంత్రి కేటీఆర్ దంపతులు బంజారాహిల్స్‌లోని నందినగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాచిగూడలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని జూబ్లీక్లబ్ పోలింగ్ కేంద్రంలో ప్రముఖ నటుడు చిరంజీవి దంపతులు ఓటు వేశారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 74,67,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికార తెరాస అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా, భాజపా 149, కాంగ్రెస్ 146, తెదేపా 106, ఎంఐఎం 51, సీపీఐ 17, సీపీఎం 12, ఇతర గుర్తింపు పొందిన పార్టీలు 76, స్వతంత్ర అభ్యర్థులు415 మంది బల్దియా బరిలోఉన్నారు.9,101 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది.