తెలుగు తేజం, కంచికచర్ల : కంచికచర్ల ప్రాంతానికి భారీ వర్షాలు కొత్త కాదు కానీ ఎన్నడూ లేనంతగా కంచికచర్ల మధిర జాతీయ రహదారిపై మోకాళ్ళ లోతు నీరు నిలిచి ఉంది. దిగువన ఉన్న చెరువు లోనికి వెళ్ళుతున్న నీరు చెరువు పూర్తిగా నిండిపోయిన కారణంగా రహదారి పైనే ఆగ వలసిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల భారీ వర్షాల కారణంగా చెరువు నిండా సమృద్ధిగా నీరు ఉండి నిండుకుండను తలపిస్తుంది. కానీ భారీ వర్షాల పడుతున్న సమయంలో చెరువులో నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేనప్పుడు దిగువ ప్రాంతాలు జలమయమవ్వక తప్పదు. ప్రధానంగా కంచికచర్ల చెరువు కట్ట వద్ద బైపాస్ నిర్మిస్తున్న ఎల్ ఐ డి ఐ పి ఎల్ సంస్థ అవగాహన లోపం కనిపిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వాగు లతోపాటు వర్షపు నీరు తో చెరువు నిండిన తర్వాత చెరువు కట్ట వద్ద అండర్ పాస్ నుండి మాత్రమే నీరు బయటికి వెళ్ళ వలసిన పరిస్థితి ఏర్పడింది. నీరు బయటకు వెళ్లే దారిలో ఎస్ అమరవరం రహదారి లో కేవలం నాలుగు అడుగుల వైశాల్యం కలిగిన రెండు తూములను మాత్రమే ఏర్పాటు చేశారు. దీనితో పెద్ద ఎత్తున వచ్చిన వరద నీరు ఎస్ అమరవరం రహదారి కోతకు గురయ్యే అంతగా రహదారి వెంబడి పంట చేలపైనుండి ప్రవహించింది.రహదారి వెంబడి చెరువు అంచున గోడ నిర్మాణం చేపట్టడం వలన చెరువు నుండి నీరు బయటికి వెళ్లే మార్గం సరిగా లేకపోవడం వలన గతంలో అనేకమార్లు కంచికచర్ల చెరువుకు భారీగా వరదనీరు చేరినప్పటికీ చెరువు పక్కనే ఉన్న ఇళ్లలోకి వరదనీరు చేరలేదని ప్రస్తుతం వరద నీరు ఇళ్ళలోనికి ప్రవేశించడమే కాకుండా పెంపుడు జంతువులు మృత్యువాత పడ్డాయని ఇందుకు బైపాస్ నిర్మాణం సంస్థ బాధ్యత వహించాలని చెరువు కట్ట ప్రాంతంవారు కోరుతున్నారు. రహదారి వెంబడి ప్రవహిస్తున్న చెరువు నీరు కారణంగా వాహనదారులు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ మళ్ళిస్తూ మూడు గంటల పాటు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎల్ ఐ డి ఐ పి ఎల్ ఈ రహదారి నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందని నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు లేవని ప్రస్తుతం ప్రస్తుతం ఈ ప్రాంతంలో భారీ వర్షం కురవడం వలన రోడ్డుపైన కొన్ని కొన్ని గుంతలు ఏర్పడ్డాయని వాటిని మరమ్మతు చేయడం జరుగుతుందని ఎల్ ఐ డి ఐ పి ఎల్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆదినారాయణ తెలిపారు