తెలుగు తేజం, నందిగామ : నందిగామ పట్టణంలోని వేంచేసి ఉన్న అతి ప్రాచీనమైన ప్రసిద్ధిగాంచిన పుణ్య పంచలింగ క్షేత్రమైన శ్రీ శుక శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసం చివరి రోజు కావడంతో శ్రీ శుక శ్యామలాంబ అమ్మవారు,గౌరీ పాడ్యమి సందర్భంగా గౌరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమానికి మహిళా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు దండిభట్ల బాలకృష్ణ శాస్త్రి యడవల్లి సాయి ప్రసాద్, పవన్ కుమార్ ల ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించి వివిధ రకాల పూలతో అలంకరించి అమ్మవారికి కుంకుమార్చన పూజ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.