Breaking News

కేరళ సి.ఎం. మామూలోడు కాదు.

Saturday, 11 Nov, 4.19 pm

కమ్యూనిస్టు భావజాలం నీది.. చాలా కష్టం. నువ్వు బతకలేవురా అంటూ కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలను అంటుంటారు.కానీ కమ్యూనిస్టులు ఎలాంటి వారో అందరికీ తెలుసు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేయడంలో వారిది కీలక పాత్ర.ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించడంలో వీరికి అంద వేసిన చేయి.ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ముఖ్యమంత్రలే ఉన్నారు.అందులో కేరళ సిఎం పినరయి విజయన్ మొదటి వారు.కేరళ ముఖ్యమంత్రిగా ఇప్పటికి విజయన్ 533 రోజుల పాటు పాలనను కొనసాగించారుఈ పాలనలో ఆయనపై చిన్న ఆరోపణలు కూడా లేదు. ఎప్పుడూ సాదాసీదాగా ఉండే కేరళ సిఎం అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఒక పనిచేశారు.తన ఛాంబర్ నుంచి బయటకు వచ్చి ఎవరి తోడు లేకుండా ఒక ఆటో ఎక్కి కాకా హోటల్‌కు వెళ్ళి కడుపునిండా భోజనం చేశారు.కాకా హోటల్లో కొంతమంది కేరళ సిఎంను గుర్తించారు కానీ మరికొంతమంది గుర్తించలేదుగుర్తించిన వారికి మాత్రం ఆయన చెప్పొద్దంటూ చేతులూపాడు. హోటల్ సిబ్బంది కూడా మామూలు వ్యక్తికి ఎలాగైతే భోజనం పెడతారో..అదేవిధంగా సిఎంకు భోజనం పెట్టారు. ఆయన భోజనం చేసి వెళ్ళిన తరువాత సిఎం అని తెలుసుకున్న హోటల్ సిబ్బంది ఆశ్చర్యపోయారు.ఇప్పుడు కేరళ సిఎం ఒంటరిగా వెళ్ళి భోజనం చేసిన ఫోటో వైరల్‌గా మారుతోంది.సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూడటం కోసం తాను ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తున్నానంటున్నారు కేరళ సి.ఎం.

.

.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *