రైల్వే జనరల్ మేనేజర్ కు జనసేన పార్టీ నాయకులు వినతిపత్రం
తెలుగు తేజం, విజయవాడ : కృష్ణాజిల్లా కొండపల్లి రైల్వే స్టేషన్లో శాతవాహన ఎక్స్ప్రెస్ రైలును నిలపాలని మరియు కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యాకు జనసేన పార్టీ నాయకులు బుధవారం విజయవాడలో వినతి పత్రం అందజేశారు. తమ వినతి పట్ల రైల్వే జనరల్ మేనేజర్ సానుకూలంగా స్పందించినట్లు జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) తెలిపారు.