నేడు ఎన్నికల నోటిఫ్ నోటీసులు జారీ చేయనున్న ఆర్డిఓ రీ శ్రీను కుమార్
డిసెంబర్ 5న పోలింగ్ అదే రోజు ఫలితాలు ప్రకటన
తెలుగు తేజం, గుడివాడ : గుడివాడ పట్టణానికే తలమానికంగా నిలిచే ఎన్టీఆర్ స్టేడియం కి మూడేళ్ల కొకసారి జరిగే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికలకు ఈసారి రాష్ట్ర పౌరసరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) కొత్త ప్యానల్ ను సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరించే స్టేడియం కమిటీకి కార్యదర్శి హోదాలో ఉన్న గుడివాడ ఆర్ డి ఓ జి శ్రీను కుమార్ ఎన్నికల అధికారిగా ఉన్నారు. ట్రెజరర్ గా గుడివాడ మండల తాసిల్దార్ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎగ్జిక్యూటివ్ కమిటీ కి జరిగే ఎన్నికల్లో వైస్ చైర్మన్, జాయింట్ సెక్రెటరీల తో పాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎన్నికవుతారు. ఇప్పటికే మంత్రి కొడాలి నాని 14 మందితో ప్యానల్ సిద్ధం చేసుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఎన్నికలకు సంబంధించి నెల ౧వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ అధికారి శ్రీను కుమార్ జారీ చేయనున్నారు తేదీ నామినేషన్ పత్రాలు అందుబాటులో ఉంచుతారు ఐదో తేదీ ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మీటింగ్ హాల్ లో నామినేషన్లు దాఖలు చేయవచ్చు. మధ్యాహ్నం 12 -2 గంటల వరకు స్కూటీని జరుగుతుంది. మధ్యాహ్నం 1-2గంటల లోపు నామినేషన్ విత్ డ్రా చేసుకోవచ్చు. 245 నుండి 3-45 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది 4-45 గంటలకి ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ కమిటీని అధికారికంగా ప్రకటిస్తారు. కాగా స్టేడియం నిర్మాణానికి 1984 మార్చి 25న శంకుస్థాపన జరిగింది. 2005 సంవత్సరం నుండి స్టేడియానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి కమిటీకి వైస్ చైర్మన్ జగన్ దివంగత బొప్పన బాపినీడు ప్రసాద్ సంయుక్త కార్యదర్శిగా దివంగత డాక్టర్ పొట్లూరి గంగాధర్ రావు లు 2009 వరకు పనిచేశారు 2009 – 12 ఎగ్జిక్యూటివ్ కమిటీ కి దివంగత కటారి శ్రీనివాసరావు కొద్దికాలానికి గొర్ల శ్రీదేవి సంయుక్త కార్యదర్శిగా పొట్లూరి శ్రీమన్నారాయణ వ్యవహరించారు తర్వాత రెండేళ్ళ పాటు ఎన్నికలు జరగలేదు 2014 17 ఎగ్జిక్యూటివ్ కమిటీ వైస్ చైర్మన్ గా ఇందిరా రమణారావు కార్యదర్శిగా ఎలవర్తి శ్రీనివాసరావు 2017 20 ఎగ్జిక్యూటివ్ కమిటీ వైస్ చైర్మన్ గా పిన్నమనేని సాంబశివరావు కార్యదర్శి నర్రా రత్న శేఖర్ లో సేవలందించారు 2023 కాలానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికల్లో పోటీ చేసేందుకు మంత్రి కొడాలి నాని ప్యానెల్ సిద్ధమైన నేపథ్యంలో మరో ప్యానల్ పోటీకి దిగుతుందో లేక ఏకగ్రీవానికి దారితీస్తుందో చూడాలి.