తెలుగు తేజం, ఇబ్రహీంపట్నం: గ్రామాభివృద్ధిలో సర్పంచ్ లు కీలక పాత్ర పోషించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సూచించారు. జూపూడి సర్పంచ్ కాకి దేవమాత, పాలకవర్గ సభ్యులు మంగళవారం ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సేవ చేసే అవకాశం లభించడం అదృష్టమన్నారు. గ్రామ సమస్యలపై పాలకవర్గానికి అవగాహన ఉండాలన్నారు. ప్రధానమైన తాగునీరు, డ్రెయిన్లు, పారిశుధ్య నిర్వహణపై శ్రద్ధ చూపాలని సూచించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.