బాపులపాడు (తెలుగుతేజం ప్రతినిధి):కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రంగన్న గూడెం గ్రామం లోని గ్రామ దేవత గంగానమ్మ విగ్రహం పునఃప్రతిష్ట జరిగి 11 సంవత్సరాలు పూర్తయ్యి 12 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు ఉదయం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రముఖులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు, గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగా మణి, గ్రామ ఎంపీసీఎస్ అధ్యక్షులు మొవ్వా శ్రీనివాసరావు, సామాజిక వేత్త పుసులూరి లక్ష్మి నారాయణ, వంశపారంపర్య ధర్మకర్త ఆళ్ళ శ్రీనివాసరావు తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం మాట్లాడుతూ రంగన్న గూడెం గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, కరోనా మూడో వేవ్ కూడా గ్రామానికి దరిచేరకుండా గ్రామస్తులు అందరూ అయుర్ ఆరోగ్యాలతో విలసిల్లాలని గ్రామదేవత గంగానమ్మ ను వెడుకొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు ప్రముఖులు మొవ్వ విష్ణు మూర్తి, కసుకుర్తి వెంకట నరసింహారావు, చట్టు రంగారావు, దేవరకొండ శ్రీనివాసరావు, కాట్రు పాపారావు, పాలపర్తి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.