న్యూఢిల్లీ: వ్యక్తుల ఫోన్లు, డిజిటల్ డివైస్లను తనిఖీ చేసి, స్వాధీనం చేసుకోవడానికి మార్గదర్శకాలు అవసరమని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది. మీడియా ప్రొఫెషనల్స్ కోసం ఇవి అవసరమని చెప్పింది. జర్నలిస్టుల పరికరాల్లో విశ్వసనీయ వర్గాల నుంచి సేకరించిన సమాచారం, వివరాలు ఉంటాయని తెలిపింది. జర్నలిస్టులను విచారించేందుకు, వారి ఫోన్లు, ల్యాప్ట్యాప్ల వంటివి స్వాధీనం చేసుకొనేందుకు ప్రత్యేక విధి విధానాలు రూపొందించాలని ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్ పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.