తెలుగు తేజం ఇబ్రహీంపట్నం : స్థానిక డాక్టర్ జాకీర్ హుస్సేన్ కళాశాల ఆవరణంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాలో జిల్లా నలు వైపుల నుండి పాల్గొన్న అభ్యర్థులతో విశేష స్పందన లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ మహా భాష అన్నారు. జాబ్ మేళా సందర్భంగా నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సులభంగా ఎంపిక సాధించాలంటే రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ తమ కళాశాలలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ సదుపాయాలను వినియోగించుకోవాలన్నారు. ఈ జాబ్ మేళా లో 325 మంది అభ్యర్థులు పాల్గొనగా 67 మంది ఎంపికయ్యారు. ఎంపిక కార్యక్రమాన్ని రాఘవ డెవలపర్ మరియు బిల్డర్ ప్రైవేట్ లిమిటెడ్ రిలయన్స్ జియో లిమిటెడ్ టీం తాజ్ సంస్థకు చెందిన హెచ్ఆర్ మేనేజర్ ఎం ప్రియ, పి అజయ్, ఎం కస్తూరి టెక్నికల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేశారు. 47 మంది అభ్యర్థులను వెయిటింగ్ లిస్టులో ఉంచారన్నారు. వివిధ విభాగాలతో ఎంపికైన అభ్యర్థులకు అర్హతను బట్టి పది వేల నుంచి 25 వేల జీతం లభిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ మేనేజర్ ఈ ప్రణయ్ పర్యవేక్షించగ, ఎస్ సి సి కోఆర్డినేటర్ మోహన్ బాబు సాయి చరణ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు మస్తాన్ వలి ,జాఫర్ ,సాదిక్ ,నాగుల మీరా పాల్గొన్నారు.