అసాంఘిక శక్తులపై చర్యలు తీసుకోవాలి ..
రౌడీ షీటర్ లు, ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించాలి ..
తెలుగు తేజం, నందిగామ : నందిగామ డిఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు ని మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా”మొండితోక అరుణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బగా పట్టణంలోని పలు సమస్యలను ఎస్పి దృష్టికి తీసుకెళ్లారు. నందిగామ పట్టణంలోని ట్రాఫిక్ సమస్య ,రౌడీషీటర్ ల పై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ రానున్న నూతన సంవత్సర వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు, అంతేకాకుండా ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి మద్య నిషేధానికి పటిష్ట చర్యలు తీసుకుటుండటంతో తెలంగాణ నుంచి మద్యం అక్రమ రవాణా జరుగుతుందనే ఆరోపణలు నెలకొన్నాయని ,మద్యం అక్రమ రవాణా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ,నేర చరిత్ర కలిగిన వారి పట్ల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అరుణ్ కుమార్ ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు , ముఖ్యంగా పట్టణంలోని పలు రహదారులలో ట్రాఫిక్ సమస్య జటిలమవుతుందని ,ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా పోలీసు అధికారులను ఆదేశించాలని అరుణ్ కుమార్ కోరారు ..