తెలుగు తేజం, మచిలీపట్నం : జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావును కలెక్టర్ ఇంతియాజ్ జిల్లా కోర్టులో శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మెగా లోక్‌అదాలత్ ద్వారా వివిధ కేసులను పరిష్కరిస్తున్న విధానాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కలెక్టరుకు వివరించారు. మెగా లోక్‌అదాలత్‌లో రాజీపడదగిన అన్ని సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, చెక్‌బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద క్లయిమ్ కేసులను పరిష్కరించుకునేందుకు ఉత్తమ మార్గమని జిల్లా జడ్జి వివరించారు. కలెక్టరు వెంట డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో ఖాజావలి తహసీల్దారు సునీల్‌బాబు ఉన్నారు. ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. లోక్‌అదాలత్‌లో కేసుల పరిష్కారంపై వారు చర్చించుకున్నారు.
మెగా లోక్‌అదాలత్‌ను ప్రారంభించిన జిల్లా జడ్జి
జిల్లా కోర్టు ప్రాంగణంలో మెగాలోక్ అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు శనివారం ప్రారంభించారు. జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని కోర్టులలో మెగాలోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. మచిలీపట్నంలో 4 బెంచ్‌లు, జిల్లా వ్యాప్తంగా 37 బెంచ్‌లను ఏర్పాటు చేసి వివిధ కేసులను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.