తెలుగు తేజం, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
” నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నాను. ఇటీవల కాలంలో నన్ను కలిసిన వారంతా క్వారంటైన్లో ఉండాలని.. కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి” అని ట్వీట్ చేశారు.