అమరావతి (తెలుగు తేజం ప్రతినిధి); మంగళగిరి నగర పరిధిలోని ఎర్రబాలెం డిలైట్ డాబా రెస్టారెంట్ లో కోవిడ్ ప్రోటో కాల్ ఉల్లంఘించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ సోషల్ మీడియా లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు.మంగళగిరి తహసీల్ధార్ కోవిడ్-19 ఇన్సిడెంట్ కమాండర్ జీవి రామ్ ప్రసాద్ ఆదేశాల మేరకు ఇంచార్జ్ చంద్రకాంత్,విఆర్వో అనిత వివరాలు సమర్పించారు.కోవిడ్ నిబంధనలు పాటించనందుకు డిలైట్ డాబా యాజమాన్యంపై కోవిడ్ ఉల్లంఘనల కేసు నమోదు చేసినట్లు ఇన్సిడెంట్ కమాండర్ రామ్ ప్రసాద్ ఆదివారం తెలిపారు.భౌతిక దూరం,మాస్కుల వాడకం వంటి నిబంధనలు ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.