తెలుగు తేజం,: తెలుగుదేశం పార్టీ నాయకులు కళా వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు అరెస్ట్ చేయడానికి ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కోగంటి బాబు స్థానిక పెద్ద బజార్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోగంటి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పై అక్రమ కేసులు బనాయిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అధికారం చూసుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తించ వద్దని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు మాగంటి పుల్లారావు కంచికచర్ల మండల మాజీ ఉపాధ్యక్షుడు గుత్తా ఓంకార్ ,గుదే నరేష్, గుత్తా రమేష్, నంబూరి వెంకటబాబు, శేషం వెంకటేశ్వరరావు, వనపర్తి వెంకటేశ్వరావు చాప మోహన్, కంచె రమేష్,నాగయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..