అమరావతి, తెలుగుతేజం ప్రత్యేక ప్రతినిధి: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ”ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు.ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు” అని ట్వీట్లో పేర్కొన్నారు.