విజయవాడ (తెలుగు తేజం ప్రతినిధి): బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఏసీబీ అధికారులు ఎన్ని దాడులు చేసిన అవినీతికి అంతం లేకుండా పోతుంది. శుక్రవారం మరో ఉద్యోగి చేతివాటం ప్రదర్శించి సస్పెన్షన్ కు గురయ్యారు అందిన వివరాల ప్రకారం ఆలయంలో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు కు ఓ భక్తుడు డు రూ 10,116 అమ్మవారికి కానుకగా సమర్పించగా వంద రూపాయల కే రసీదు ఇవ్వడంతో అవాక్కయిన భక్తుడు వెంటనే ఆలయ కార్యనిర్వాహక అధికారి భ్రమరాంబ దృష్టికి తీసుకెళ్లాడు . ఈ విషయంపై వెంటనే స్పందించి సదరు రికార్డు అసిస్టెంట్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు ఆలయంలో ఎవరైనా ఉద్యోగస్తులు అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆలయ ఈవో హెచ్చరించారు.