తెలుగు తేజం, నందిగామ : కృష్ణా జిల్లాలోని నందిగామ మండలం చందాపురంలో దొంగలు బీభత్సం సృష్టించారు. చందాపురంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో అర్ధరాత్రి హుండీ పగల గొట్టి.. అందులో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు దుండగులు ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున వాచ్మన్ వచ్చే సమయానికి హుండీ పగలడంతో వాచ్మన్ వెంటనే గ్రామస్థులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాక్షాత్తు శ్రీ రామనవమి పండగ రోజే రాములోరి బంటు ఆంజనేయ స్వామి గుడిలో దొంగతనం జరగటం అపచారం అంటున్నా పండితులు గ్రామ ప్రజలు ఇంత పెద్ద మహిమగల దేవాలయంలో సీసీ కెమెరాలు లేకపోవడం విడ్డూరం అంటున్న గ్రామస్తులు ఘటనా స్థలం వద్ద సి.ఐ కనకారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
గతంలో దేవాలయాల పై జరుగుతున్న దాడుల నేపథ్యంలో సి.ఐ కనకరావు గ్రామగ్రామాన తిరిగి ప్రజలతో, దేవాలయ కమిటీ సభ్యులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి అని చెప్పినా పెడచెవిన పెట్టిన ఆలయ కమిటీలు సిసీ కెమెరాలు లేకపోవడం,సరైన రక్షణ లేకపోవడం వల్ల దొంగతనం జరిగిందని అంటున్న గ్రామాస్తులు.