- చిట్టేడు కెనరా బ్యాంకులో అధికారులు బదిలీ..
- బ్యాంకు లో పని చేసే గోల్డ్ అప్రోజర్ నకిలీ బంగారు మార్పిడి నేపథ్యంలో కొనసాగుతున్న విచారణ..
- బ్యాంకు మేనేజర్ నందగోపాల్, క్యాషియర్ రమణయ్యల బదిలీ చేసిన ఉన్నతాధికారులు..
- నూతన మేనేజర్ గా బాధ్యత తీసుకున్న అనురాగ్..
తిరుపతి జిల్లా, కోట మండలం, చిట్టేడు కెనరా బ్యాంకులో నకిలీ బంగారం పై రుణాలు స్వాహా చేసిన ఇంటి దొంగల నిర్వాకం పై ఉన్నతాధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో అవినీతికి పాల్పడిన గోల్డ్ అప్రోజర్ అంకయ్య పై విచారణ జరుగుతుండగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ బ్యాంకు మేనేజర్ నందగోపాల్ , క్యాషియర్ రమణయ్యలను బదిలీ చేశారు. నూతన మేనేజర్ గా అనురాగ్ బాధ్యతలు తీసుకున్నారు.. ఆ బ్యాంకు లో గోల్డ్ అప్రోజర్ గా పనిచేసే అంకయ్య, ఖాతాదారుల బంగారానికి నకిలీ బంగారు జోడించి రుణాలు తీసుకోవడం.. ఖాతాదారులకు మాయమాటలు చెప్పి వారి ఖాతాలో నకిలీ బంగారు పెట్టి రుణాలు పొందుతూ… అటు నమ్మిన ఖాతాదారులను.. ఇటు బ్యాంకును మోసం చేసి లక్షల్లో అవినీతి సొమ్మును దోచుకున్న వారి బండారం బయటపడిన విషయం తెలిసిందే.. బ్యాంకులో జరిగిన నకిలీ బంగారం మార్పిడి అప్రోజర్ అంకయ్యతో పాటు మేనేజర్, క్యాషియర్ కూడా సంబంధాలు ఉన్నట్లు ఖాతాదారులు నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అధికారులను మార్చడమే కాకుండా బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు…