తెలుగు తేజం, నందిగామ: నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో సంక్రాంతి సందర్భంగా పోలీసుల హెచ్చరికలు కాదని కోడి పందాలు, జూదాలు నిర్వాహిస్తే కటకటాల పాలు అవుతారని నందిగామ సిఐ పి. కనకరావు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారని హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా యువత అసాంఘిక కార్యకలాపాల వైపు వెళ్ళి కుండా జిల్లా ఎస్పీ గారు అనేక క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే జిల్లా ఎస్పీ ఉత్తర్వులు మేరకు నందిగామ డియస్పి జి నాగేశ్వరరెడ్డి ఆదేశాలు ప్రకారం ఇప్పటికే అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే స్థావరాలను గుర్తించామని, ఎప్పటికప్పుడు పోలీస్ నిఘా ఉంటుందని హెచ్చరించారు. సంక్రాంతి పండుగ ను సంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని సూచించారు.