ప్రసిద్ధి చెందిన కేరళలోని పద్మనాభ స్వామి ఆలయం ప్రధాన పూజారి, సంయుక్త ప్రధాన పూజారి సహా మొత్తం పదిమంది ఆలయ పూజారులు ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడడంతో ఆలయాన్ని అక్టోబర్ 15వ తేదీ వరకు తాత్కాలిక ప్రాతిపదికపై మూసివేశారు. ఇప్పటి వరకు ప్రత్యేక పూజలు మాత్రమే నిర్వహిస్తూ వచ్చిన తంత్రి ఇక రోజువారి పూజలు నిర్వహిస్తారని, రోజు వారి పూజలకు భక్తులను అనుమతించరని ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి రథీసన్ తెలియజేశారు.