తెలుగు తేజం, మంగళగిరి: గత 25 సంవత్సరాల నుండి పాములు పట్టటం లో సిద్ధహస్తుడు, గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేట లో నివసించే ఆరోగ్య రావు పాములు పట్టటం లో సిద్ధహస్తుడు. చుట్టుపక్కల గ్రామాల నుండి ఎవరు ఫోన్ చేసినా వెంటనే వెళ్లి ఏ పామునైనా పట్టుకొని సమీపంలో ఉన్న పొలాల్లో గాని, కొండప్రాంతాల్లో గాని వదిలుతాడు. ఇక పట్టుకున్న పాముతో ముద్దులు పెట్టి మెడలో వేసుకుని విన్యాసాలు చేయటం అతనికి వెన్నతో పెట్టిన విద్య.