తెలుగు తేజం, చందర్లపాడు : చందర్లపాడులోని షాలేము ప్రార్థనా మందిరమునందు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ మండల సర్వసభ్య సమావేశము మండల అధ్యక్షులు ఎస్.ఆర్. కుమార్ అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొక్కా జార్జి ముల్లర్ మాట్లాడుతూ ” ప్రతి క్రైస్తవుడు విధిగా బైబిల్ ను కలిగి ఉండాలని,అదేవిధంగా భారత రాజ్యాంగం ప్రతిని కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలని, రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను వినియోగించుకుంటునే పరమత సహనాన్ని, మతసామరస్యాన్ని కచ్చితంగా పాటించి సమాజానికి మంచి సందేశాన్ని అందించాల్సిన బాధ్యత పాస్టర్ ల మీద ఉన్నది అని తెలియజేశారు .కోస్టల్ రీజన్ కోఆర్డినేటర్ పాల్ శంకర రెడ్డి, కృష్ణా జిల్లా అధ్యక్షులు హనోకు, జిల్లా ప్రధాన కార్యదర్శి హిజ్కీయ రాజు,బెంజిమెన్, చందర్లపాడు మండల ప్రధాన కార్యదర్శి పాల్ వినీల్, దేవరాజు,దేవ సహాయం, మహేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.