దిల్లీ: సూపర్‌స్టార్ రజనీకాంత్ శనివారం తన 70వ పుట్టినరోజు జరుపుకొంటున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని శనివారం ఉదయం ట్విటర్లో ఒక పోస్టు పెట్టారు. మరోవైపు తన పొలిటికల్ ఎంట్రీపై సుదీర్ఘ కాలంగా ఉన్న సస్పెన్స్‌కు తెరదించుతూ పార్టీ ప్రారంభించనున్నట్లు రజనీ ఈ నెల 3న ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో పార్టీని ప్రారంభిస్తామని తెలిపారు. పార్టీ ఏర్పాటు తేదీ, తదితర వివరాలను ఈ నెల 31న ప్రజలకు వెల్లడిస్తామన్నారు. వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజనీ రాజకీయ ప్రవేశం కీలకంగా మారింది. శరద్పవార్కూ శుభాకాంక్షలు..
శనివారం ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 81వ పుట్టినరోజు జరుపుకొంటున్న ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు.