తెలుగు తేజం, నందిగామ : ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించినప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో నేటికీ అమరజీవిగానే మిగిలి ఉన్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.మొండితోక అరుణ్ కుమార్ పేర్కొన్నారు. నందిగామ పార్టీ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 68 వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు ,ముందుగా పార్టీ కార్యాలయంలో అమరజీవి చిత్రపటానికి, గాంధీ సెంటర్లో అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా డా. అరుణ్ కుమార్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టిశ్రీరాములు కృషి మరువలేనిదన్నారు, మహాత్మా గాంధీ బోధించిన సత్యం,అహింస ,హరిజనోద్ధరణ వంటి ఆశయాల కోసం అనితర కృషి చేశారని ఆయన గుర్తు చేశారు ,సొంత కులం వారే వ్యతిరేకించినా దళితులకు ఆలయ ప్రవేశం కల్పించే విషయంలో రాజీలేని పోరాటం చేశారని చెప్పారు ,పొట్టి శ్రీరాములు అందించిన స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి కులమతాలకు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు.
సేవా తత్పరులకు అమరజీవి అవార్డులు :
నందిగామ నియోజకవర్గంలో పేదలకు ,బడుగు బలహీన వర్గాల వారికి ,ప్రజలకు ఆపన్న హస్తం అందిస్తూ ప్రజా సేవ చేస్తున్న సేవా తత్పరులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమరజీవి పేరుమీద అవార్డులను ఇచ్చే కార్యక్రమం వచ్చే ఏడాది ఆయన జయంతి రోజున ప్రారంభిస్తున్నామని, దీనిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు మండవ పిచ్చయ్య గుడివాడ సాంబశివరావు బండారు వెంకట్రావు రంగారావు అంగడాల పూర్ణచందర్రావు మహమ్మద్ మస్తాను మారాం అమరయ్య కొంచెం లక్ష్మీనారాయణ ఆవుల విజయ తదితరులు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు