తెలుగు తేజం, విజయవాడ : ఆంగ్లేయుల పాలన నుండి మన భారత దేశాన్ని రక్షించుకుని స్వతంత్ర పాలన చేసుకొనుటకు భారత రాజ్యాంగాన్ని రూపొందించుకోని రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసుకునే రోజే జనవరి 26 అని, ఈరోజు ఎంతో ప్రాముఖ్యతను చోటుచేసుకుని గణతంత్ర దినోత్సవ వేడుకని డిటీసీ యం పురేంద్ర అన్నారు. స్థానిక డిటిసి కార్యాలయంలో మంగళవారం ఉదయం కార్యాలయ ప్రాంగణంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు డిటిసి ఎం పురేంద్ర పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు . ఈ సందర్భంగా డిటిసి మాట్లాడుతూ ఎంతో మంది మహానుభావులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశం కోసం అర్పించి స్వతంత్ర భారత దేశమును రక్షించుకునేందుకు పాటుపడ్డారని ఆయన గుర్తుచేశారు. మన దేశం పట్ల అంకితభావంతో ఉంటూ దేశ సమగ్రతను కాపాడే విధంగా భారతదేశ పౌరులుగా మనమందరం ఉండాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు సేవలు అందించడంలో పూర్తిస్థాయిలో న్యాయం చేకూర్చిన రోజునే మనం రాజ్యాంగ పట్ల విధేయత చాటిన వారమౌతా మన్నారు జిల్లాలోని రవాణాశాఖ అధికారులకు ఉద్యోగులకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం రవాణాశాఖ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం రూపొందిన 2021 సూతన సంవత్సరం క్యాలెండర్ ను డిటీసీ ఆవిష్కరించారు.
ఈ వేదికపై ఆర్టీవో రామ్ ప్రసాద్, ఎం.వి ఇన్స్పెక్టర్ జి సంజీవ్ కుమార్, రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం .రాజుబాబు లు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వాహనాల తనిఖీ అధికారులు భీమరావు, డి ఎస్ ఎస్ నాయక్,జి నాగ మురళి, ప్రవీణ్, యండి అలీ, శ్రీమతి రాధికాదేవి, నారాయణ స్వామి, నెహ్రు, కార్యాలయ పరిపాలన అధికారులు సిహెచ్ శ్రీనివాసరావు, శ్రీమతి కవిత, ప్రభాకరలింగం, సత్యనారాయణ, నాగ మురళి మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.