ప్రేమ పేరుతో ఏడు సంవత్సరాల కిందట పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి మరో ఇద్దరికి అబార్షన్ చేయించి చివరికి వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తూ, అధికార పార్టీ అండదండలతో అధికారాన్ని అడ్డుపెట్టుకొని బాధితురాలు కు అన్యాయం చేస్తున్న వారిపైన చర్యలు తీసుకొని అమ్మాయికి న్యాయం చేయాలని ప్యాపిలి పట్టణంలోని పోలీస్ స్టేషన్ నందు ఏపీ మహిళా సమాఖ్య, సిపిఐ ఆధ్వర్యంలో బాధితురాలు తరపున సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు షమీం బేగం మరియు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి వెంకటేషు మాట్లాడుతూ ప్యాపిలి మండలంలోని ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బాబయ్య రామాంజనమ్మ ల కుమారుడు పవన్ అనే యువకుడు జమ్మలమడుగు కు చెందిన లిల్లీ అనే అమ్మాయికి ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది ఈ క్రమంలో వారిరువురూ ప్రేమించి తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకొని ఏడు సంవత్సరాలుగా కాపురం చేశారు. ఫలితంగా వారిరువురు సితార ,శాన్విక అనే ఇద్దరు ఆడపిల్లకు జన్మనిచ్చి ఈరోజు అత్యాశతో కట్నం మీద మోజు పడి పవన్ మరొక పెళ్లికి సిద్ధమై తనను నమ్మి తనకే సర్వస్వాన్ని అర్పించిన అమ్మాయికి ద్రోహం చేస్తూ ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి నాకు అదనపు కట్నం కావాలని అమ్మాయిని బెదిరిస్తూ చిత్రహింసలు పెడుతూ ఇంట్లో నుంచి తరిమి కొట్టారని, ఆ అమ్మాయికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదు అంటే కనిపిస్తే నిన్ను చంపేస్తాను అని, నానా దుర్భాషలాడి ప్రకాష్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడితే పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసు లను ఆశ్రయించినను ఇంతవరకు ఆమెకు న్యాయం చేయడం లేదని వారు మండిపడ్డారు, కావున ఇప్పటికైనా బాధితురాలు కి అండగా ఉండి అమ్మాయికి న్యాయం చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షమీమ్ బేగం,షబానా,మాధవి,సూర్య,పద్మావతి,తదితరులు పాల్గొన్నారు