గుంటూరు : గుంటూరు జిల్లా బాపట్ల వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్‌పై ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. ఎంపీ నివాసం వద్దే ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన బత్తుల పూర్ణచంద్రరావుగా గుర్తించారు. ఎంపీ సురేష్ తన ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో పూర్ణచంద్రరావు తన బైక్‌ను అడ్డుపెట్టాడు. ఆపై రాడ్‌తో దాడి చేయబోయాడు. వెంటనే అప్రమత్తమైన ఎంపీ సురేష్ గన్మెన్లు పూర్ణచంద్రరావును అడ్డుకున్నారు. దీంతో అతను అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా గన్మెన్లు వెంటాడి అతన్ని పట్టుకుని తుళ్లూరు పోలీసులకు అప్పగించారు.