తెలుగుతేజం, వత్సవాయి : మండలంలో బీజేపీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టిశ్రీరాములు 68వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించినప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో నేటికీ అమరజీవిగానే మిగిలి ఉన్నారని, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టిశ్రీరాములు కృషి మరువలేనిదన్నారు ,మహాత్మా గాంధీ బోధించిన సత్యం,అహింస ,హరిజనోద్ధరణ వంటి ఆశయాల కోసం అనితర కృషి చేశారని ఆయన గుర్తు చేశారు ,సొంత కులం వారే వ్యతిరేకించినా దళితులకు ఆలయ ప్రవేశం కల్పించే విషయంలో రాజీలేని పోరాటం చేశారని అన్నారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ఫలితమే ఆంధ్రరాష్ట్ర ఆవిర్భావం అని గుర్తుచేశారు. అయన లాంటి పోరాట స్ఫూర్తి మనకు రావాలని ఆకాంక్షించారు.శ్రీరాములు ఆశయాలను బీజేపీ మరియు జనసేన ఇరు పార్టీలు సంయుక్తంగా ముందుకు తీసుకెళ్తామని వారు తెలిపారు ఈకార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా,జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ పాల్గొన్నారు బీజేపీ నాయకులు యువ మోర్చా ప్రెసిడెంట్ కరుణ్ చంద్ నాయుడు, కృష్ణారెడ్డి అప్పారావు చారి శ్రీను మండల జనసైనికులు వెంకట్, రామారావు,గోపాల్ తదితరులు పాల్గొన్నారు.