విజయవాడ: విజయవాడలో మరో ప్రేమోన్మాద ఘటన జరిగింది. ఇటీవల ప్రేమిచడం లేదని యువతిని సజీవ దహనం చేసిన ఘటన మరచిపోకముందే బిటెక్ విద్యార్థిని ఫై దాడి జరిగింది. దివ్య తేజస్విని అనే యువతీ ఫై చిన్నస్వామి అనే యువకుడు దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన దివ్య తేజస్విని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కొంతకాలంగా ప్రేమ పేరుతో దివ్య తేజస్విని స్వామి అనే యువకుడు వేధింపులకు గురి చేశాడు. ప్రేమను నిరాకరించిందని యువతి ఇంటికి వెళ్లిన స్వామి ఆమెపై కత్తితో దాడి చేశాడు. దాడి తర్వాత కత్తితో తనను తాను గాయపర్చుకున్నాడు. క్రీస్తురాజపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వరుస సంఘటనలఫై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.